: మరోసారి కేసుల్లో చిక్కుకుంటే కోదండరాం ఉద్యోగం ఊడుతుంది: టీజీ
సడక్ బంద్ వంటి కార్యక్రమాల్లో పాల్గొని కేసుల్లో ఇరుక్కోవడం ప్రొఫెసర్ కోదండరాంకు సబబు కాదని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. రాజకీయ లబ్ది కోసమే ఇలాంటి నిరసనలు చేపడుతున్నారని టీజీ ఆరోపించారు. మరోసారి గనుక కోదండరాం కేసుల్లో చిక్కుకుంటే ఉద్యోగం ఊడడం ఖాయమని చెప్పారు.