: నేను ఇప్పటికీ సమైక్యవాదినే: పనబాక లక్ష్మి
తాను ఇప్పటికీ సమైక్యవాదినే అని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాను ప్రయత్నించానని... అయితే, హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేకపోయానని తెలిపారు. తనపై విమర్శలు చేయడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నానని, అయితే రాష్ట్ర ప్రభుత్వం తనకు సహకరించలేదని ఆరోపించారు. కేంద్ర నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని చెప్పారు. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న పనబాక ఈ రోజు మీడియాతో మాట్లాడారు.