: ముఖ్యమంత్రి పదవి బడుగులకు ఇస్తామని చంద్రబాబు ప్రకటన
టీడీపీ అధినేత చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని బడుగు, బలహీన వర్గాలకు చెందిన నేతకు ఇస్తామని ప్రకటించారు. నిన్న జరిగిన రంగారెడ్డి జిల్లా టీడీపీ నేతల సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. బీసీలకు మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నట్లు చంద్రబాబు నేతలతో చెప్పారు. అయితే, ఒక్క బీసీలకే అని చెప్పకుండా.. బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అని ప్రకటించాలని వారు సూచించారు. అలా అయితే, అందరికీ ద్వారాలు తెరచి ఉంచినట్లు అవుతుందన్నారు. దీంతో ముఖ్యమంత్రి సహా కీలక పదవులను బడుగు, బలహీన వర్గాలకే ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.