: యాదగిరి గుట్టలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఇవాళ నిర్వహించిన పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు. శివ పంచాక్షరి, మూల మంత్ర జపంతో అర్చక బృందం పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం త్రిశూల స్నాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణవేణి, ఛైర్మన్ నరసింహమూర్తి తదితర ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.