: అమెరికా హెచ్చరికలను పెడచెవిన పెట్టిన రష్యా
క్రెయిన్ వ్యవహారంలో జోక్యం చేసుకోరాదన్న అమెరికా హెచ్చరికలను రష్యా పెడచెవిన పెట్టింది. రష్యా పెద్ద ఎత్తున సైనిక బలగాలను తమ సరిహద్దు ప్రాంతానికి తరలిస్తోందని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఇగోర్ తెన్యుఖ్ తెలిపారు. ఇప్పటివరకు 30 ప్రత్యేక వాహనాల్లో 6000 మంది సాయుధులను తరలించిందని తెలిపారు. ఇప్పటికే క్రిమియా ప్రాంతంలో రష్యా అనుకూల వేర్పాటు వాదులు పార్లమెంటును, ప్రభుత్వ భవనాలను దిగ్బంధించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా, ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ కు ఆశ్రయమిస్తామని కూడా రష్యా ప్రకటించింది. ఈ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం హెచ్చరికలను సైతం రష్యా ఖాతరు చేయకపోవడం గమనార్హం.