: మున్పిపల్ కార్పొరేషన్ల రిజర్వేషన్లు ఖరారు
రాష్ట్రంలోని 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, నెల్లూరు, అనంతపురం, కడప, చిత్తూరు, రామగుండం, నిజామాబాద్ తదితర నగర పాలక సంస్థలకు రిజర్వేషన్లను ప్రకటించారు. 158 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల ఛైర్మన్ల పదవులకు సంబంధించి రిజర్వేషన్లు కూడా ప్రభుత్వం ఖరారు చేసింది.