: ట్రాఫిక్ నియంత్రణకు రోబోలు


కూడళ్ళ వద్ద ట్రాఫిక్ వెతలు తెలిసిందే. సిగ్నల్ జంపింగులు, రాంగ్ రూట్లో డ్రైవింగ్ లు సర్వసాధారణం. అక్కడ విధులు నిర్వర్తించే కానిస్టేబుళ్ళు కొందరు ట్రాఫిక్ నియంత్రణలో అష్టకష్టాలు పడుతుంటారు. వారిలో కొందరు చలాన్ల పేరిట చేతివాటం కూడా ప్రదర్శిస్తుంటారు. వీటన్నింటికి చెక్ పెడుతూ ఆఫ్రికా దేశం కాంగో ట్రాఫిక్ విధుల కోసం రోబోలను రంగంలోకి దింపింది. ప్రయోగాత్మకంగా రాజధాని కిన్షాసాలో రోబోలతో ట్రాఫిక్ విధులు నిర్వర్తింపజేస్తున్నారు.

ఎనిమిది అడుగుల ఎత్తు ఉండే ఈ ట్రాఫిక్ రోబోకు మూడు లైట్లుంటాయి. ఓ చేయి పైకెత్తి 'డ్రైవర్లూ ఇప్పుడు పాదచారులకు మార్గం వదలండి' అని గద్దిస్తుందట కూడా. తద్వారా కాలినడకన వెళ్ళేవాళ్ళు సురక్షితంగా రోడ్డు దాటడానికి వీలవుతుంది. ఇది అచ్చు ట్రాఫిక్ కానిస్టేబుల్ మాదిరే వ్యవహరిస్తోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ విధానంపై అధికార వర్గాల్లోనూ, ప్రజల్లోనూ సంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రస్తుతానికివి సౌరశక్తితో పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో వీటిని మరింత ఆధునికీకరించనున్నట్టు కాంగో అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News