: కస్తూరి రంగన్ నివేదికకు వ్యతిరేకంగా కేరళలో సమ్మె
పశ్చిమ కనుమల్లో కస్తూరి రంగన్ నివేదికను అమలు చేయడాన్ని నిరసిస్తూ కేరళలోని ఇడుక్కి, వయనాడ్ జిల్లాలో సమ్మె జరిగింది. ప్రతిపక్ష వామపక్ష కూటమికి చెందిన కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. నివేదిక అమలును వెంటనే నిలిపివేసి వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.