: వీరప్ప మొయిలీపై మహేశ్ భట్ తీవ్ర వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీపై బాలీవుడ్ సీనియర్ దర్శకుడు మహేశ్ భట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొయిలీని 'కార్పొరేట్ పరాన్నజీవి' అని విమర్శించారు. జన్యు మార్పులు చేసిన పంటలకు భారత్ లో అనుమతించడం ద్వారా మొయిలీ పెద్ద తప్పిదం చేశాడని భట్ అభిప్రాయపడ్డారు. ఇంతకుముందు కేంద్ర పర్యావరణ మంత్రిగా పనిచేసిన జయంతి నటరాజన్ ఈ పంటలకు అనుమతి నిరాకరించగా, మొయిలీ ఆ నిర్ణయాన్ని భేఖాతరు చేస్తూ జీఎం పంటలకు గేట్లెత్తారు. భారత్ నుంచి ప్రతి ఏటా 260 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతుండగా, జీఎం పంటల అవసరమేంటని భట్ ప్రశ్నించారు. ఈ పంటల ద్వారా దేశంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని గతకొంతకాలంగా పర్యావరణ ఉద్యమకారులు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.