: శ్రీకాళహస్తిలో భక్తులకు నందీశ్వరునిగా దర్శనమిచ్చిన స్వామివారు
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు (శనివారం) స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం జరుగుతోంది. ఈ ఉత్సవం సందర్భంగా నంది వాహనంపై ఆసీనులైన స్వామివారు మాడవీధుల్లో విహరించారు. నందీశ్వరుణ్ణి పట్టువస్త్రాలు, విశేష ఆభరణాలతో అలంకరించారు. అమ్మవారు కామధేను వాహనంపై ఆసీనులై స్వామి వారి వెంట వచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో స్వామి వారి ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది.