: అంగన్ వాడీ కార్యకర్తల సమ్మె విరమణ
కనీస వేతనాలు పెంచాలంటూ గత 13 రోజులుగా అంగన్ వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో వారు సమ్మెను తాత్కాలికంగా విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యామని, సమ్మెను విరమిస్తున్నట్లు అంగన్ వాడీ కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు.