: ఇకపై బెంగళూరులో రాత్రి ఒంటి గంట వరకు తాగి చిందేయొచ్చు
బెంగళూరు నగరంలో రాత్రి జీవితం మరింత హుషారెత్తనుంది. ఇకపై నగరంలోని రెస్టారెంట్లు, ఈటరీస్, కాఫీ షాప్స్ రాత్రి ఒంటి గంట వరకు సేవలందించబోతున్నాయి. దీనికితోడు, మందు ప్రియుల కోసం వారానికి రెండు రోజులు (శుక్రవారం, శనివారం) బార్స్, పబ్స్ రాత్రి ఒంటి గంటవరకు స్వాగతం పలకనున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ రాత్రి 11 గంటలకే మూతపడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో యువతను ఆకర్షించడానికి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.