: కేవీపీని అవసరమైతే మళ్ళీ పిలుస్తాం: సీబీఐ జేడీ
జగన్ అక్రమాస్తుల కేసులో వైఎస్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావును ఎనిమిదిన్నర గంటలపాటు విచారించిన అనంతరం సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. కేసుకు సంబంధించి కొన్ని వివరాలందాయని, ఇంకా సమాచారం అందాల్సి ఉందని తెలిపారు.
అవసరమైతే కేవీపీని మళ్ళీ విచారణకు పిలుస్తామని చెప్పారు. కాగా, కేవీపీని సీఆర్ పీసీ 160 కింద విచారించినట్టు ఆయన వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం ప్రభుత్వానికి లేఖ రాస్తామని జేడీ చెప్పారు. జగన్ కేసులో దర్యాప్తు పూర్తయిన పిమ్మటే తుది ఛార్జి షీటు దాఖలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.