: పార్టీలోకి రమ్మని చంద్రబాబు రాయబారం పంపాడు: రామచంద్రయ్య
టీడీపీలోకి రమ్మని ఆ పార్టీ అధినేత తన వద్దకు రాయబారం పంపారని మాజీ మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు సీట్ల అయోమయంలో ఉన్నారని, పదవులిస్తాం మా పార్టీలో చేరండంటూ ఆ పార్టీ నేతలను రాయబారానికి పంపుతున్నారని ఆరోపించారు. బీజేపీతో దోస్తీకి చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నారన్న రామచంద్రయ్య, బీజేపీ కారణంగానే విభజన సాధ్యమైందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు.