: కప్ప దాట్లు కామనే: మాజీ మంత్రి ఆనం
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) పగ్గాలు ఎవరికి అప్పగించినా అభ్యంతరం లేదని మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో కప్పదాట్లు సాధారణమేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కూడా ఆ జాబితాలో ఉన్నారని ఆయన అన్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంపై కాంగ్రెస్ నేతలు ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, కొండ్రు మురళి తదితరులు ఈరోజు సమావేశమయ్యారు. ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై వారు ఈ సమావేశంలో చర్చించారు.