: అక్కడ డిన్నర్ చేయాలంటే.. రూ.లక్షా 68 వేలు చెల్లించాల్సిందే!


అక్కడ 695 అడుగుల ఎత్తులో ‘హెలిప్యాడ్ డిన్నర్’ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన, విలాసవంతమైన హోటళ్లలో నాలుగో స్థానంలో ఉన్న దుబాయ్ లోని ‘ది బుర్జ్ అల్ అరబ్ హోటల్’ పై డిన్నర్. ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార పథకానికి నిధుల సేకరణ కోసం ఇలా వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. 212 మీటర్లు.. అంటే 695 అడుగుల ఎత్తులో ఉన్న హోటల్ లోని హెలిప్యాడ్ పై కేవలం 12 మంది అతిథుల కోసం ఈ నెల 13వ తేదీన ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేసింది. ఈ విందు ఆరగించాలనుకునే వారు 2,722 డాలర్లు (1,68,083 రూపాయలు) చెల్లించాల్సి ఉంటుంది. ఈ హెలిప్యాడ్ డిన్నర్ ద్వారా అందిన మొత్తం సొమ్మును ప్రపంచ ఆహార పథకానికి విరాళంగా అందించనున్నారు. ఈ పథకం కింద ఐక్యరాజ్యసమితి రోజుకు సుమారు లక్షా 20 వేల మంది చిన్నారులకు ఆహారాన్ని అందిస్తోంది.

  • Loading...

More Telugu News