: 'ఓట్ ఫర్ మోడీ' నినాదాలతో మార్మోగిన ఓయూ
ఈ రోజు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్శిటీలో 'ఓట్ ఫర్ ఇండియా, ఓట్ ఫర్ మోడీ' కార్యక్రమాన్ని ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 5కే రన్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండానే పోటీ చేస్తామని అన్నారు. కార్యక్రమం సందర్భంగా ఓయూ క్యాంపస్ మోడీ నినాదాలతో మార్మోగింది.