: కాంగ్రెస్ తో టీఆర్ఎస్ కలసి వస్తేనే మంచిది: జానా రెడ్డి
తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మాట్లాడిన మాజీ మంత్రి జానా రెడ్డి, కాంగ్రెస్ తో టీఆర్ఎస్ కలసి వస్తేనే మంచిదన్నారు. దానివల్ల తెలంగాణ రాష్ట్రానికే మంచిదన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం కాంగ్రెస్ తో అందరూ కలసి రావాలన్నారు. అయితే, ఈ విషయంలో చర్చలకు ఇంకా అవకాశం ఉందని, తాను కేసీఆర్ తో చర్చలు జరుపుతానన్నారు. ఒకవేళ టీఆర్ఎస్ కలసి రాకపోయినా కాంగ్రెస్ కు వచ్చిన నష్టం లేదన్నారు. సొంత ఎంపీలను బహిష్కరించి మరీ తెలంగాణ ఇచ్చారని, ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని ఢిల్లీలో చెప్పారు.