: ఇస్రో భాస్కరయానం
ఇప్పటికే చంద్రయాన్ పేరిట చంద్రమండలం రహస్యాలను విప్పే ప్రయత్నం చేసిన ఇస్రో తాజాగా సూర్యగోళం విశేషాలను కూడా వెలుగులోకి తేవాలని నిశ్చయించుకుంది. ఈ ప్రాజెక్టు 2020 కల్లా పూర్తి చేయాలని భావిస్తున్నామని ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ తెలిపారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, ఈ మిషన్ కు 'ఆదిత్య' అని పేరుపెట్టామని వెల్లడించారు. 2017-20 మధ్య ఈ ప్రాజెక్టు ఉంటుందని చెప్పారు.