: ఇద్దరు పోప్ లు కలిసిన వేళ..
ఒకరు తాజా పోప్.. మరొకరు గౌరవ పోప్.. ఇప్పుడు ఇద్దరూ కలిసి లంచ్ చేసేందుకు రంగం సిద్ధం అయింది. 600 ఏళ్ళ క్యాథలిక్ చరిత్రలో ఇద్దరు పోప్ లు కలవడం ఇదే తొలిసారి. ఎందుకంటే, ఎప్పుడూ కూడా పోప్ మరణించిన తర్వాతే నూతన పోప్ ను ఎన్నుకుంటారు. అయితే, బెనడిక్ట్-16 అనారోగ్య కారణాలతో పోప్ పదవి నుంచి వైదొలగడంతో కొత్త పోప్ గా మారియో బెరాగ్లియో ఎంపికయ్యారు.
ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు వాటికన్ సెంట్రల్ స్క్వేర్ వద్ద క్యాథలిక్కులు బారులు తీరారట. ఇక బెనడిక్ట్-16ని తోడ్కొని రావడానికి కొత్త పోప్ ఫ్రాన్సిస్ హెలికాప్టర్ లో దక్షిణ రోమ్ లో ఉన్న ఆయన అధికారిక నివాసానికి వెళ్ళారు.