: ఘనంగా ముగిసిన కపిలేశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు


తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తుదిఘట్టం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో ఈరోజు (శనివారం) ఉదయం త్రిశూల స్నానం వేడుకగా సాగింది. మంగళవాయిద్యాలు, అర్చకుల వేద మంత్రోచ్చారణ మధ్య స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పంచామృతాలతో అభిషేకాలు చేశారు.

కపిల తీర్థంలో చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవారికి భక్తులు మంగళ హారతులు సమర్పించి పుణ్యస్నానాలు ఆచరించారు. త్రిశూల స్నానంతో, పదిరోజుల నుంచి వైభవంగా కొనసాగిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

  • Loading...

More Telugu News