: చదివేది 3వ తరగతి.. కానీ 65 శాతం మంది చదవలేరు
మన దేశంలో విద్యార్థుల ప్రతిభ ఎలా ఉందో కేంద్ర మావనవనరుల అభివృద్ధి శాఖా మంత్రి పళ్లం రాజు తెలిపారు. మూడవ తరగతి చదివే విద్యార్థుల్లో 65 శాతం మందికే చదవడం వచ్చు. సరిగా అర్థం చేసుకోగలరు. ఫొటో ఇస్తే దానిని 86 శాతం మందే గుర్తించగలరు. సులభమైన లెక్కలను 70 శాతం మందే చేయగలరు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ దేశవ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులపై అధ్యయనం నిర్వహించగా ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. 14 రాష్ట్రాలు భాషా ప్రమాణాల విషయంలో సాధారణం కంటే ఎక్కువలో ఉంటే.. 14 రాష్ట్రాలు దిగువన ఉన్నాయి. వీటిలో ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు ఉన్నాయి. విద్యలో నాణ్యత ముఖ్యమైన అంశమని.. ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమాణాలు అంత ప్రతికూలంగా ఏమీ లేవని మంత్రి పళ్లం రాజు చెప్పారు.