: వారి చేరిక బాధకలిగిస్తోంది... ఇతరుల తప్పులు ఎలా ఎన్నుతాం?: చింతకాయల
క్రమశిక్షణ గల పార్టీగా నీరాజనాలు అందుకున్న టీడీపీలో కాంగ్రెస్ పార్టీ గజదొంగల చేరిక బాధ కలిగిస్తోందని ఆ పార్టీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటా టీడీపీ కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం అయ్యన్న కాలనీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజాశ్రేయస్సును కాంక్షించిన టీడీపీలోకి కాంగ్రెస్ పార్టీ నేతలను చేర్చుకుంటున్నారని, తెలుగు జాతికి ద్రోహం చేసిన కాంగ్రెస్ నేతలను టీడీపీలోకి చేర్చుకుని తప్పు చేస్తే, ఇతరుల తప్పులను ఎలా ఎన్నగలమని ఆయన ప్రశ్నించారు. గజదొంగలు తమ పార్టీలో చేరడంతో పార్టీ కూడా కలుషితమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.