: మాఘ అమావాస్య సందర్భంగా భద్రాద్రి రాముడికి ప్రత్యేక పూజలు
ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇవాళ (శనివారం) మాఘ మాసం అమావాస్య తిథిని పురస్కరించుకుని భద్రాద్రి రాముడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయ సన్నిధిలోని బేడా మండపంలో ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజన సేవ నిర్వహించారు. అనంతరం శ్రీసీతారామచంద్ర లక్ష్మణస్వాములను పంచామృతాలతో అభిషేకించారు.