: ఏడుపాయల జాతరకు పోటెత్తిన భక్తులు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలకు పోటెత్తిన భక్తులతో జాతర కోలాహలంగా సాగుతోంది. మెదక్ జిల్లా నాగ్సాన్ పల్లిలో జరుగుతున్న జాతరలో రెండో రోజున ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయానికి తెలంగాణ ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. జాతరలోని ముఖ్యఘట్టం బండ్ల ఊరేగింపు కార్యక్రమం ఆద్యంతం భక్తుల ఆనందోత్సాహాలతో సాగింది. ఊరేగింపునకు ముందు ఉంచిన గుమ్మటాల బండిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.