: నేడు బీజేపీలో చేరనున్న మాజీ ఆర్మీ చీఫ్
ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ నేడు బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద అమరజవాన్ జ్యోతికి నివాళులు అర్పించిన అనంతరం సింగ్ బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం కాషాయ దండులో చేరతారు. ప్రముఖ సామాజిక, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే బృందంలో సింగ్ ముఖ్యుడిగా ఉన్నారు. తమ పార్టీలోకి రావాలంటూ సింగ్, కిరణ్ బేడీలను బీజేపీ సాదరంగా ఆహ్వానించింది.