: కేజ్రీవాల్ రోడ్ షో ప్రారంభం
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పట్టణంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ రోడ్ షో ఈ ఉదయం ప్రారంభమైంది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయన రోడ్ షో ద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఈ రోజు ప్రారంభమైన రోడ్ షో రేపు కాన్పూర్ కు చేరుకుంటుంది. సోమవారం అరారియా, మధుర, పులవాల్ ప్రాంతాల్లో పర్యటించి ఢిల్లీకి ప్రయాణమవుతారు. ఉత్తరప్రదేశ్ లో అత్యధిక సీట్లను బీజేపీ గెలుచుకుంటుందంటూ సర్వేలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఆ రాష్ట్రంపై దృష్టి పెట్టారు.