: రజనీ సూచన మేరకు అంబరీష్ సింగపూర్ కు తరలింపు
ప్రముఖ సినీ నటుడు, కర్ణాటక మంత్రి అంబరీష్ ను ఈ తెల్లవారుజామున సింగపూర్ కు తరలించారు. శ్వాస కోశ ఇన్ ఫెక్షన్ కారణంగా ఆయన గత కొన్ని రోజులుగా బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల క్రితం నటుడు రజనీకాంత్ ఆసుపత్రికి వచ్చి, సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా అంబరీష్ సతీమణి సుమలతకు సూచించారు. ఆయన సూచన మేరకే అంబరీష్ ను సింగపూర్ తీసుకెళ్లినట్టు సమాచారం. విక్రమ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు మాట్లాడుతూ, అంబరీష్ క్రమంగా కోలుకుంటున్నారని, వదంతులను నమ్మరాదని కోరారు.