: సీబీఐ జేడీని కలిసిన తెలంగాణ న్యాయవాదులు
జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఈ ఉదయం నుంచీ సీబీఐ, కేవీపీని ప్రశ్నిస్తోంది. మరోవైపు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు కలుసుకున్నారు. వైఎస్ ఆత్మగా పేరున్న కెవిపి రామచంద్రరావు మీద వారు సీబీఐ జేడీకి ఫిర్యాదుచేశారు. కేవీపీ అక్రమాలపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అవన్నీ సీబీఐ కి అందజేస్తామని వారీ సందర్భంగా జేడీకి వెల్లడించారు.