: సీఎస్ మహంతి పదవీకాలం పొడిగింపు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి పదవీ కాలాన్ని నాలుగు నెలల పాటు పొడిగించారు. జూన్ 30 వరకు ఆయన సీఎస్ పదవిలోనే కొనసాగనున్నారు. ఈ మేరకు నిన్న రాత్రి జీవో విడులైంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, రాష్ట్ర విభజన, రాష్ట్రపతి పాలన తదితర అంశాల నేపథ్యంలో, మహంతిని సీఎస్ పదవిలోనే కొనసాగించాలని ప్రధాని మన్మోహన్ ఆదేశించడంతో, కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.