: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు పెంపు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని మరింత పెంచాలన్న ఎన్నికల సంఘం ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీంతో లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థులు గరిష్టంగా రూ. 70 లక్షల వరకూ ఖర్చుపెట్టవచ్చు. ఇంతకు ముందు ఈ పరిమితి రూ. 40 లక్షలుంది. ఇక, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులు గరిష్టంగా రూ. 28 లక్షలు వ్యయం చేయవచ్చు. ఇప్పటివరకూ ఈ పరిమితి రూ. 14 లక్షలుంది.