: తెలుగు కాంగ్రెస్ గా మారుతున్న టీడీపీ: పెన్మత్స
టీడీపీ రాను రాను తెలుగు కాంగ్రెస్ పార్టీగా మారుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పెన్మత్స సాంబశివరాజు అన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ,కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వైఎస్సార్సీపీని ఆశ్రయించి ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో టీడీపీలోకి వెళ్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని తూర్పారపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ నేతలను తన పార్టీలో చేర్చుకుంటూ ఆ పార్టీని తెలుగు కాంగ్రెస్ పార్టీగా మారుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తమ పార్టీకి తెలంగాణ జిల్లాల్లో కూడా వైఎస్సార్ అభిమానులు ఉన్నారని, తెలంగాణలో కూడా తమ పార్టీ సత్తా చాటుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.