: పీటర్సన్ పీడ విరగడైందంటున్న ఇంగ్లండ్ వైస్ కెప్టెన్
ఇటీవలే జట్టు నుంచి అవమానకరరీతిలో ఉద్వాసనకు గురైన స్టార్ బ్యాట్స్ మెన్ కెవిన్ పీటర్సన్ విషయంలో ఇంగ్లండ్ ఆటగాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పీటర్సన్ లేకపోవడంతో ఇకపై డ్రెస్సింగ్ రూం ప్రశాంతంగా ఉంటుందని ఇంగ్లండ్ జట్టు వైస్ కెప్టెన్ మాట్ ప్రయర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవల ముగిసిన యాషెస్ లో పీటర్సన్ ఆటతీరుపై ప్రయర్ బహిరంగంగానే ధ్వజమెత్తాడు. కేపీలో చిత్తశుద్ధి లోపించిందని విమర్శించాడు. ఇంగ్లండ్ జట్టుకు ఆడుతున్నానన్న ఆలోచనే అతడికి లేదని ఆరోపించాడు. భవిష్యత్తులో ఇంగ్లండ్ జట్టును విజయపథంలో నడిపించాలని భావించే ఆటగాళ్ళకే డ్రెస్సింగ్ రూంలో చోటు ఉంటుందని ప్రయర్ స్పష్టం చేశాడు.