: తెహల్కా మాజీ ఎడిటర్ పై మరో కేసు


మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ పై మరో కేసు నమోదైంది. జైల్లో సెల్ ఫోన్ కలిగి ఉండడంతో ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. ఇటీవలే ఢిల్లీలోని కొందరు పాత్రికేయులు ఇచ్చిన సమాచారం మేరకు వాస్కో జైల్లో ఉన్న తేజ్ పాల్ బ్యారక్ లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో తేజ్ పాల్ వద్ద సెల్ ఫోన్ లభించింది. ప్రతిరోజు ఉదయం తేజ్ పాల్ ఢిల్లీకి కాల్స్ చేసేవాడని తెలుస్తోంది. లైంగిక దాడి ఆరోపణలపై తేజ్ పాల్ కు జ్యుడిషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News