: తెలంగాణ గడ్డ మీద జైరాం రమేష్ ఏం మాట్లాడుతున్నాడు?: కేసీఆర్
కేసీఆర్ విశ్వసనీయతపై, విభజనపై విమర్శలు సంధించిన కేంద్ర మంత్రి జైరాం రమేష్ పై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ గడ్డ మీద కూర్చుని కేంద్ర మంత్రి జైరాం రమేష్ ఏం మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 'తెలంగాణ రాష్ట్ర విభజన తనకు ఇష్టం లేదని అంటున్నారు, అలా అంటే తెలంగాణ ప్రజలను అవమానించడమే'అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం సంగతి మార్చి 3న తేలిపోతుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ విలీనం గురించి తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని అన్నారు. తానొక్కడు విలీనం అంటే సరిపోదని, పార్టీ మొత్తం విలీనం అంటేనే కార్యరూపం దాలుస్తుందని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు.