: దళితులకు రూ. 10 వేల కోట్లతో ప్యాకేజి: కేసీఆర్
దళితుల కోసం కేటాయించిన నిధులను గత ప్రభుత్వాలు పక్కదారి పట్టించాయని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులకు రూ. 10 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని చెప్పారు. వితంతువులకు రూ. 1000 పించను ఇస్తామని చెప్పారు. తెలంగాణలో విద్యుత్ పెను సమస్యగా మారనుందని... రానున్న రెండేళ్లలో 15 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సిన అవసరముందని తెలిపారు. విభజనను చంద్రబాబు చివరి వరకు అడ్డుకునే ప్రయత్నం చేశారని... తెలంగాణలోని టీడీపీ నేతలంతా ఆ పార్టీని వీడాలని సూచించారు.