: 24 జిల్లాలు.. జిల్లాకో నిమ్స్ తరహా ఆసుపత్రి: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగులకు రూ. 1500 పించను ఇస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. తెలంగాణ జిల్లాలను 24కు పెంచుతామని... ప్రతి జిల్లా కేంద్రంలో నిమ్స్ తరహా ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించారు. ప్రతి మండలంలో లక్ష ఎకరాలకు సరిపడా సాగునీటిని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం ఎకరా కోటి ఉంటే... రానున్న రోజుల్లో ఎకరా ఐదు కోట్లకు పెరుగుతుందని జోస్యం చెప్పారు. గిరిజన తండాలకు ప్రత్యేక పంచాయతీ హోదా కల్పిస్తామని తెలిపారు.