: ప్రొ. కోదండరామ్ కి ఊరట.. 8మందికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు
సడక్ బంద్ సందర్భంగా అరెస్ట్ అయిన తెలంగాణ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్, శ్రీనివాస్ గౌడ్ వంటి టీ జేఏసీ నేతలతో సహా మరికొందరు టీఆర్ఎస్ నేతలకు బెయిల్ దొరికింది. దీంతో కోర్టు తీర్పుకోసం వేచిచూస్తోన్న తెలంగాణ వాదుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మొత్తంగా 8 మందికి బెయిల్ మంజూరు చేస్తూ ఆలంపూర్ కోర్టు నిర్ణయం తీసుకుంది.
ఈటెల రాజేందర్, జూపూడి కృష్ణారావు తదితరులు మొన్నటి నుంచీ మహబూబ్ నగర్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం 11 మందికిగాను 8 మందికి మాత్రమే ఆలంపూర్ కోర్టు పదివేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.