: శనివారం నుంచి వైఎస్ జగన్ ‘జయభేరి’ యాత్ర ప్రారంభం


మార్చి నెల ఒకటో తేదీ నుంచి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధినేత జగన్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ‘జయభేరి’ యాత్రను ప్రారంభిస్తున్నారు. శనివారం నాడు తిరుపతి నుంచి మొదలయ్యే ఈ యాత్ర పలు జిల్లాల మీదుగా సాగుతూ మార్చి 14వ తేదీన నల్లగొండ జిల్లాలో ముగుస్తుందని వైఎస్సార్సీపీ నేత తలశిల రఘురాం తెలిపారు. ఈ ఓదార్పు యాత్రకు సంబంధించి షెడ్యూలు వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.

శనివారం నాడు తిరుపతి నగరంలో ‘జనభేరి’ మొదలవుతోంది. సాయంత్రం లీలామహల్ సర్కిల్లో జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు. అనంతరం 3, 4 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో, ఐదో తేదీన తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలో జనభేరి యాత్ర జరుగనుంది.

  • Loading...

More Telugu News