: త్వరలో పెరగనున్న రైలు ఛార్జీలు!


త్వరలో రైల్వే ఛార్జీలు పెరగనున్నాయి. అక్టోబర్ నుంచి రైలు ఛార్జీలు పెరిగే అవకాశం ఉందంటూ రైల్వే బోర్డు చైర్ పర్సన్ వినయ్ మిట్టల్ చెప్పినట్లు మీడియా కథనాలు తెలుపుతున్నాయి. 2013-14 రైల్వే బడ్జెట్లో ఏసీ, తత్కాల్, రిజర్వేషన్ ఛార్జీలు పెంచిన రైల్వేశాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ ఎలాంటి సాధారణ ఛార్జీలు పెంచలేదు.

ఇక
 పెంచనున్న ఛార్జీల్లో... సాధారణ రెండవతరగతి రైళ్లలో కిలోమీటరుకు 2 పైసలు, నాన్ సబర్బన్ రైళ్లలో కిలోమీటరకు 3 పైసలు పెరగనుంది. ఇక రెండవతరగతి మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో కిలో మీటరుకు 4 పైసలు, స్లీపర్ క్లాస్ లో 6 పైసలు పెరగనున్నాయి. ఈ సంవత్సరంలో మొదటిసారి జనవరిలో రైలు చార్జీలు పెరిగాయి.

  • Loading...

More Telugu News