: పరిగిలో తిరగబడిన ట్రాక్టర్, ముగ్గురు మృతి


రంగారెడ్డి జిల్లా పరిగిలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని వారు దర్యాప్తు చేపట్టారు. మృతులు మహబూబ్ నగర్ జిల్లా కెందుర్గు మండలానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News