: నాలుగు పరుగుల ఆధిక్యంలో భారత్
కోట్లా టెస్టులో భారత్ ఆటతీరు కూడా ఆసీస్ కు తగ్గని రీతిలోనే సాగుతోంది. రెండో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట చివరికి 8 వికెట్లు నష్టపోయి 266 పరుగులు చేసింది. పిచ్ స్పిన్నర్లకు విశేషంగా సహకరిస్తుండడంతో టీమిండియా బ్యాట్స్ మెన్ నిలదొక్కుకునేందుకు విఫలయత్నాలు చేశారు.
ఓపెనర్లు పుజారా, విజయ్ మినహా మరెవ్వరూ అర్థసెంచరీలు సాధించలేకపోయారు. కంగారూ స్పిన్నర్ లియాన్ 5 వికెట్లతో అదరగొట్టాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి భారత్ భారీ స్కోరు ఆశలకు కళ్ళెం వేశాడు. కాగా, ప్రస్తుతం భారత్.. ఆసీస్ పై 4 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది.
క్రీజులో భువనేశ్వర్ (10 బ్యాటింగ్) ఉన్నాడు. అంతకుముందు ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ ను 262 పరుగుల వద్ద ముగించింది. ఓవర్ నైట్ స్కోరు 231/8 తో రెండో రోజు ఆట ప్రారంభించిన కంగారూలు కాస్సేటికే మిగిలిన రెండు వికెట్లను చేజార్చుకున్నారు. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు తీశాడు.