: కొత్త రాజధాని రేసులో 6 నగరాలు: జైరాం రమేష్


సీమాంధ్రకు రాజధాని రేసులో 6 నగరాలున్నాయని కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలిపారు. అయితే ఏ నగరం రాజధానిగా ఉండబోతోంది అనే విషయాన్ని నిపుణుల కమిటీ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. జైరాం రమేష్ తెలిపిన లిస్టులో... తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, గుంటూరు, ఒంగోలు నగరాలు ఉన్నాయి. ఈ మేరకు జీవోఎంకు ప్రతిపాదనలు అందాయని ఆయన తెలిపారు. ఈ రోజు హైదరాబాదులోని గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు తెలిపారు. అయితే, కొత్త రాజధాని ఏదనే విషయంపై ఆరు నెలల్లోగా కమిటీ నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. కొత్త రాజధానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుందని, మౌలికవసతులు కల్పిస్తుందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News