: భారత్ అవినీతి ప్రకపంనలు అమెరికాకూ చేరాయి!


భారత్ లో అవినీతి వేళ్ళూనుకుపోయిందని అమెరికా కాంగ్రెస్ ఓ నివేదికలో పేర్కొంది. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లోనూ, ఆఖరికి న్యాయవ్యవస్థలోనూ ఈ మకిలి పేరుకుపోయిందని తెలిపింది. ఈ నివేదికపై అమెరికా ప్రభుత్వ కార్యదర్శి జాన్ కెర్రీ మాట్లాడుతూ, భారత్ లో అవినితి జాఢ్యం విస్తరించిందని చెప్పారు. కాగా, భారత్ లో అవినీతి నిరోధానికి కఠిన చట్టాలు ఉన్నా, ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమవుతోందని ఆ నివేదిక స్పష్టం చేసింది. గత ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్య కాలంలో అవినీతి వ్యవహారాలపై సీబీఐ 583 కేసులు నమోదు చేసిందని, 2012లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) వద్ద 7,224 కేసులు నమోదయ్యాయని కూడా ఆ నివేదికలో పొందుపరిచారు.

  • Loading...

More Telugu News