: చాక్లెట్ తింటే.. మీ గుండె గట్టిదే


ముదురు రంగు చాక్లెట్లు తినే అలవాటు మీకుందా..? అయితే మీ గుండె గట్టిదే. ధమనులు గట్టిపడడాన్ని ఈ చాక్లెట్లలోని ఫ్లేవనాల్ అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అథెరోస్కెల్ రోసిస్(ధమనుల గోడలు కుచించుకుపోవడం) వల్ల గుండె పోటు బారిన పడే ప్రమాదం ఎక్కువ. ఈ ముదురు రంగు చాక్లెట్లు తినడం వల్ల.. ధమనులను సాగేలా చేయడంతోపాటు.. లోపలి గోడలకు తెల్లరక్తకణాలు అంటుకోవడాన్ని తగ్గిస్తాయని పరిశోధనలో వెల్లడైంది. 44 మంది మధ్య వయసు పురుషులకు రోజుకు 70 గ్రాముల ముదురు రంగు చాక్లెట్లను నాలుగు వారాలపాటు ఇచ్చి ఈ ఫలితాలను విశ్లేషించినట్లు వేజెంజిన్ వర్సిటీ ప్రొఫెసర్ డీడ్రిక్ ఎస్సెర్ తెలిపారు.

  • Loading...

More Telugu News