: నక్సల్స్ ఏరివేతకు ఎంఐ-17 వి-5 హెలికాప్టర్లు


దేశంలో నక్సల్స్  ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ల కోసం అత్యాధునిక ఎంఐ-17 వి-5 హెలికాప్టర్లను వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇటీవలే ఆధునికీకరించిన ఈ రష్యా తయారీ హెలికాప్టర్లను నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లలో రంగంలోకి దించేందుకు భారత వాయుసేన సన్నాహాలు చేస్తోంది. ఈ తరహా హెలికాప్టర్లను ఇప్పటివరకు వాయుసేన మాత్రమే ఉపయోగిస్తోంది. ఈ చాపర్లలో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటుంది.

దీంట్లో ఉన్న నావిగేషన్ వ్యవస్థ సాయంతో రాత్రి వేళల్లో సైతం గాలింపు చర్యలు చేపట్టవచ్చు. కాగా, నాగ్ పూర్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న ఈ హెలికాప్టర్ల స్క్వాడ్రన్ మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లలో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లలో పాలుపంచుకుంటుందని వాయుసేన వర్గాలు తెలిపాయి. 2009 నుంచి భారత వాయుసేన.. నక్సల్స్ ఏరివేత కార్యక్రమాల్లో సీఆర్పీఎఫ్ కు సహకరిస్తోంది. 

  • Loading...

More Telugu News