: తిరుపతిలో కన్నుల పండువగా కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలు


తిరుపతిలోని కపిల తీర్థంలో కొలువైన శ్రీ కపిలేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా... ఈరోజు (శుక్రవారం) పృష మృగ వాహనంపై ఆసీనులై స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో రంగు రంగుల పుష్పాలంకరణ, స్వర్ణాలంకార భూషితులైన స్వామి, అమ్మవార్లు తిరుపతి నగర వీధుల్లో విహరించారు. కపిలేశ్వరుని దర్శించుకున్న భక్తులు అడుగడుగునా నైవేద్యాలు సమర్పించి, మంగళ హారతులు పట్టారు.

  • Loading...

More Telugu News