: బీసీసీఐ ఆదాయం 18,636 కోట్లు: సంజయ్ పటేల్
ఐసీసీ మొత్తాన్ని ప్రక్షాళన చేయడంతో వివిధ బోర్డుల నుంచి బీసీసీఐకి ఆదాయాలు పెరుగుతున్నాయని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. భువనేశ్వర్ లో బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ, రానున్న ఎనిమిదేళ్లలో 3,727 కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుందని అన్నారు. 2013 నుంచి 2015 మధ్య మూడు ప్రధాన కమిటీలలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉందని ఆయన తెలిపారు.
ఐసీసీకి ఆదాయం సంపాదించి పెట్టే బోర్డుల్లో బీసీసీఐది అగ్రస్థానమని పటేల్ వెల్లడించారు. ఐసీసీకి 68 శాతం ఆదాయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇస్తూ కేవలం 4 శాతం మాత్రమే తిరిగి తీసుకునేదని, ఇప్పుడు 21 శాతం తీసుకోనుందని ఆయన వివరించారు. దీంతో 2015-23 మధ్య బీసీసీఐ స్థూల ఆదాయం 18,636 కోట్ల రూపాయలకు చేరుకోనుందని ఆయన తెలిపారు.