: అల్లరి నరేష్ కు జంధ్యాల అవార్డ్
కామెడీతో హీరోలుగా మనగలుగుతున్న వారు తెలుగు సినీ పరిశ్రమలో తక్కువనే చెప్పాలి. అయితే, కేవలం హాస్యంతోనే స్టార్ హోదా సంపాదించుకున్న హీరో అల్లరి నరేష్. నటుడు రాజేంద్రప్రసాద్ తర్వాత అంత స్థాయిలో అభిమానులను అలరింపజేస్తున్న నరేష్ ను 'హాస్య బ్రహ్మ జంద్యాల అవార్డు' వరించింది. వరుస హాస్య చిత్రాలతో తెలుగు పరిశ్రమకు తన వంతు పేరు తెచ్చిపెడుతున్నందుకు ఈ అవార్డు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. మార్చి 2, 3, 4 తేదీల్లో పాలకొల్లులో జరిగే డ్రామా కార్యక్రమంలో నరేష్ కు అవార్డును ప్రధానం చేయనున్నారు. పాలకొల్లు కళాపరిషత్ పేరిట గాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పలువురు టీవీ స్టార్లను కూడా సన్మానించనున్నారు.