: ఢిల్లీలో మారనున్న ప్రధాని మకాం!
ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి పదవి నుంచి మన్మోహన్ సింగ్ దిగిపోతే ఢిల్లీలో ఇల్లు మారనున్నారు. 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మోతీలాల్ నెహ్రూ ప్యాలెస్ లోకి వెళ్లనున్నారు. దీన్ని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఇటీవలే ఖాళీ చేశారు. ప్రధాని ఇందులోకి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పలు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాని దంపతులు 7రేస్ కోర్స్ రోడ్డులోని ఓ బంగ్లాలో నివాసం ఉంటున్నారు.